వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా గోపిశెట్టి వీరన్నను నియమించినట్లు మంచిర్యాల డిసిసి అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా గోపిశెట్టి వీరన్న మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, డిసిసి అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి,మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Admin
వాస్తవ గమ్యం