Saturday, 12 September 2026 04:50:41 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

భరోసా టీం ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం

Date : 07 July 2026 05:15 PM Views : 100

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ చిత్తరంజన్ పర్యవేక్షణలో ఆసిఫాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో భరోసా టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా భరోసా సెంటర్ ద్వారా లైంగిక దాడులు, అత్యాచారాలకు గురైన బాధితులకు అందించే న్యాయ, వైద్య, మానసిక, కౌన్సెలింగ్ తదితర సేవలను వివరించారు. విద్యార్థినులకు సేఫ్ టచ్ – అన్‌సేఫ్ టచ్, పోక్సో చట్టం , బాల్య వివాహ నిరోధక చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్య ద్వారానే ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవచ్చని, చట్టాలపై అవగాహన ప్రతి విద్యార్థికి అవసరమని సూచించారు.అదేవిధంగా సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్పరిణామాల గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100కు కాల్ చేయాలని, భరోసా సహాయ నంబర్ 8712670561ను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భరోసా టీం లీగల్ అడ్వైజర్ శైలజ, కౌన్సిలర్ శ్వేత, రిసెప్షనిస్ట్ సుమలత, సపోర్ట్ పర్సన్స్ సరిత, స్నిగ్ధ, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మలత, వైస్ ప్రిన్సిపాల్ పద్మ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :