Saturday, 12 September 2026 03:57:58 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత

ఇద్దరు నిందితుల అరెస్ట్..జుడీషియల్ రిమాండ్

Date : 04 September 2026 07:47 PM Views : 290

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రెబ్బెన బస్టాండ్ వద్ద 130 గ్రాముల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు మోటరోలా జి-35 మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.7 వేలుగా పోలీసులు తెలిపారు.ఎస్సై ఎ. వెంకటకృష్ణ ఆధ్వర్యంలో గురువారం పోలీసులు రెబ్బెన బస్టాండ్ పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులను చూసి అనుమానాస్పదంగా పారిపోతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా వారు జక్కులపల్లి గ్రామానికి చెందిన ధాగం సందీప్ (24), మంచిర్యాల కు చెందిన కొండగుర్ల్ రాజేందర్ ప్రసాద్ (19) గా గుర్తించారు. సందీప్ వద్ద ఉన్న పాలిథిన్ కవర్‌లో 130 గ్రాముల గంజాయి లభించినట్లు పోలీసులు తెలిపారు.నిందితులను విచారించగా. మహారాష్ట్రలోని బల్లార్షా ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి రెబ్బెన మండలంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో మరికొందరు ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరినీ జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. రెబ్బెన సీఐ ఎం. సంజయ్ మాట్లాడుతూ.. మండలంలో గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయికి యువత దూరంగా ఉండాలని, అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.కార్యక్రమంలో ఎస్సై ఎ. వెంకటకృష్ణ, హెచ్‌సీ రవికుమార్, పీసీ నౌషద్ తదితర సిబ్బంది ఉన్నారు. గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచినందుకు ఉన్నతాధికారులు అభినందించారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: