Thursday, 30 July 2026 02:13:49 AM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

ప్రభుత్వ ఫలాలు ప్రజలకే అందాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

ఖానాపూర్‌లో వైభవంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ సమావేశం

Date : 02 May 2026 04:22 PM Views : 87

వాస్తవ గమ్యం / తెలంగాణ / నిర్మల్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ చేయడమే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ ప్రధాన ఉద్దేశ్యమని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక ప్రణాళికతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. ఖానాపూర్ నియోజకవర్గానికి 6,155 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, సుమారు 53 వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతోందని వివరించారు. రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలతో పాటు, ఇటీవల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.జిల్లాలో పారిశుధ్యం, విద్య, వైద్య రంగాల్లో పురోగతి సాధించామన్నారు. పదవ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.త్వరలోనే ఇందిరమ్మ జీవిత బీమా,పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ వంటి నూతన పథకాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, సిపిఓ జీవరత్నం, మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :