Sunday, 13 September 2026 06:41:45 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

నూతన ప్రెస్ క్లబ్ కమిటీకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఘన సన్మానం

Date : 19 June 2026 07:06 PM Views : 103

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: పట్టణ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మందమర్రి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. పట్టణంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు గజ్జల చందర్, ప్రధాన కార్యదర్శి సలాముద్దీన్, కోశాధికారి సకినాల శంకర్‌లకు శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ, తమపై చూపిన అభిమానానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సన్మానం తమ బాధ్యతలను మరింత పెంచిందని, జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తామని పేర్కొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ, నూతన ప్రెస్ క్లబ్ కమిటీ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు నిష్పక్షపాత, వాస్తవ సమాచారాన్ని అందించడంలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పట్టణ నాయకులు, సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :