Tuesday, 28 July 2026 08:30:33 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

కనులపండువగా శ్రీ దుర్గా అమ్మవారి 7వ వార్షికోత్సవం:

సింగరేణి సి హెచ్ పి గోలేటి ఎక్స్ రోడ్‌లో ఘనంగా పూజలు

Date : 16 May 2026 01:58 PM Views : 329

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : సింగరేణి సి హెచ్ పి గోలేటి ఎక్స్ రోడ్డు నందు వెలిసిన శ్రీ దుర్గా అమ్మవారి 7వ వార్షికోత్సవ వేడుకలు శనివారం సింగరేణి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ పూజారులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేక మహోత్సవం భక్తులకు కనులపండువగా నిలిచింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సింగరేణి సి హెచ్ పి ఉన్నతాధికారులు, కార్మికులు మరియు ఆలయ కమిటీ సభ్యులు తమ సతీసమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. ​ఈ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ (జిఎం)ని ఆలయ కమిటీ ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ "జై మాతా ది.. జై సింగరేణి" అంటూ చేసిన భక్తిస్మరణలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. కార్యక్రమంలో సింగరేణి ఉద్యోగులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :