వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న గురువారం ఉదయం 6 గంటలకు శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పంచామృత అభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత ఫలాలతో అభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అభిషేకంలో పాల్గొనే భక్తులు తమ గోత్రనామాలు, అష్టోత్తర శతనామావళి, మంగళహారతులు, కలశం, చెంబు, పళ్ల రసాలు, పంచామృతాలు, పువ్వులు, తులసి దళాలు, తులసి దండలు తీసుకురావాలని సూచించారు.అభిషేకంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కటాక్షాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు కోరారు. స్థలం. దొరల బంగ్లా ఎమ్మెల్యే కాలనీ..
Reporter
వాస్తవ గమ్యం