Friday, 11 September 2026 02:47:35 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.

బోగే ఉపేందర్

Date : 22 August 2026 07:48 PM Views : 152

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. శనివారం రెబ్బెన మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ జేఈసీ పిలుపు మేరకు ఈ నెల 24 నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని ఆటో డ్రైవర్లను కోరారు. ఆటోలకు ఆర్‌టీఏ కార్యాలయాల్లో రేడియం స్టిక్కర్ల మినహాయింపు ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచాలని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఓలా, ఊబర్, రాపిడో వంటి అక్రమంగా నడుస్తున్న ద్విచక్ర వాహన సేవలను నిలిపివేసి, వాటి స్థానంలో ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను తీసుకురావాలని కోరారు. గతంలో ఉన్న ప్రమాద బీమాను పునరుద్ధరించాలని, ప్రభుత్వం ప్రకటించిన రూ.12 వేల ఆర్థిక సాయం వెంటనే అందించాలని, ఆటోలకు ఈ-చలాన్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సారథి వాహన్ పోర్టల్‌లో ఆటో డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో రెబ్బెన మండల గౌరవ అధ్యక్షుడు గోడిసెల వెంకటేశ్వర్ గౌడ్, ఉపాధ్యక్షుడు మోడెం రాజగౌడ్, ఆటో డ్రైవర్లు ఆనంద్, ప్రసాద్, నరేష్, వెంకటేష్, అజయ్, లక్ష్మణ్, బాబాఖాన్ తదితరులు పాల్గొన్నారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :