వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్,రాజంపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన చేపట్టారు. నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా గ్రామ పంచా యతీ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.కొంతమంది కార్మికులకు 11 నెలలుగా, సాధారణ నిధుల కింద పనిచేస్తున్న సిబ్బందికి ఐదు నెలలుగా, ఇతర సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నెలల తరబడి జీతాలు అందకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలను తక్షణమే చెల్లిం చాలని,విధి నిర్వహణకు అవసరమైన యూనిఫారాలు, బూట్లు, రక్షణ పరికరాలను అందించాలని అధికారులను డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేయకుండా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.దసరా పండుగలోగా వేతన బకాయిలు చెల్లించడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించకపోతే విధులను బహిష్కరించి ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని శ్రీకాంత్ హెచ్చరించారు.
Reporter
వాస్తవ గమ్యం