Friday, 11 September 2026 03:52:37 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 22 July 2026 05:53 PM Views : 64

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం నస్పూర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సీఐ రవీందర్‌తో కలిసి సందర్శించిన ఆయన, సీసీ కెమెరాల ఏర్పాటు, భోజనశాల, వంటశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.బాలికల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇంటర్మీడియట్ బీపీసీ విద్యార్థులతో మాట్లాడి బోధన నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు.అనంతరం నస్పూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని, అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూభారతి, సాదా బైనమా, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై కూడా సమీక్ష నిర్వహించారు.మందమర్రి, బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించిన కలెక్టర్, ఓటరు జాబితా సవరణ, భూభారతి, సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారంపై అధికారులకు పలు సూచనలు చేశారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.తదనంతరం కాసిపేట, తాండూర్ ప్రాంతాల్లో సింగరేణి నూతన ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదిత స్థలాలను సంబంధిత అధికారులు, సింగరేణి జనరల్ మేనేజర్లతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :