Saturday, 12 September 2026 09:04:09 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

యోగ సాధన వల్ల సంపూర్ణ ఆరోగ్యం

Date : 18 June 2026 05:07 PM Views : 204

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : యోగ సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని,అనేక రకాల రుగ్మతలను నివారించుకోవచ్చని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సోత్కు సుదర్శన్, డైరెక్టర్ పుస్కూరి నర్సింగరావు చైర్ పర్సన్ పోలు శ్రీనివాస్, అన్నారు. విలేజ్ మందమర్రిలోని రామాలయం సమీపంలో నిర్వహిస్తున్న ఉచిత యోగ శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. నరసింగరావు–ప్రణతి దంపతుల ఆధ్వర్యంలో, మీనాక్షి యోగ, పిరమిడ్ ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగ పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకుని దానిని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీవనశైలి వ్యాధులను కూడా నియంత్రించుకోవచ్చన్నారు.యోగ శిక్షణ కార్యక్రమం ముగియనున్న నేపథ్యంలో, మందమర్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శిక్షణలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అదేవిధంగా ఈ శిక్షణలో పాల్గొన్న పిల్లలందరికీ యోగ పట్ల ఆసక్తి చూపాలని కన్సిలేషన్ బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో యోగ మాస్టర్లు కొంపెల్లి లలిత, మీనాక్షి, లైన్స్ క్లబ్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్, తాడికొండ లూథర్ భూపాల్, బింగి రాజన్న,ఆలయ పూజారి,తదితరులు, పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: