వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చెన్నూరు పట్టణంలోని సాయిరాం ఫంక్షన్ హల్ లో ఆగస్టు 24న నిర్వహించనున్న ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరంకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను చెన్నూరు పట్టణ సీఐ బన్సీలాల్ చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు.లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూరు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ప్రజలకు అవసరమైన కంటి పరీక్షలు, వైద్యుల సలహాలు మరియు చికిత్సా సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూరు అధ్యక్షుడు లయన్ నిమ్మల సాగర్, జోన్ చైర్‌పర్సన్ లయన్ జాడి తిరుపతి, లయన్ సౌడం సంతోష్, లయన్ కట్ట సదానందం, లయన్ పప్పిరెడ్డి దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఐ బాన్సీలాల్ మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూరు ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ చేస్తున్న కృషి గొప్పదని, భవిష్యత్తులో క్లబ్ చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం, మద్దతు ఉంటుందని తెలిపారు.లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఆగస్టు 24న జరిగే ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరాన్ని చెన్నూరు పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలకు ఆరోగ్య సేవలను చేరువ చేయడమే లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం