Friday, 11 September 2026 02:55:02 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 23 July 2026 07:38 PM Views : 104

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.జిల్లాలో సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఇప్పటికే సుమారు 90 శాతం పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువుకంటే ముందే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో అనామోలీస్ ఎక్కువగా ఉన్నాయని, డిజిటలైజేషన్ పూర్తైన అనంతరం సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నోటీసులో సూచించిన ధ్రువపత్రాలను సమర్పించడం ద్వారా ఓటు హక్కును కొనసాగించుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. డబుల్, మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన వారి ఓట్లను ఎన్నికల నిబంధనల ప్రకారం తొలగిస్తామని తెలిపారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లను గుర్తించి, బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా బూత్ స్థాయి అధికారులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిజిటలైజేషన్ పూర్తైన అనంతరం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కూడా చేపడతామని వెల్లడించారు.సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, మంచిర్యాల రాజస్వ మండలాధికారి శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :