వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : మార్కెట్లో అందుబాటులోకి శారదాదేవి, దుర్గాదేవి విగ్రహాలు ఆసిఫాబాద్: పండుగలను పురస్కరించుకుని మార్కెట్లో శారదాదేవి, దుర్గాదేవి విగ్రహాలను ముందస్తుగా ఏర్పాటు చేశారు. భక్తుల కోసం వివిధ రకాల విగ్రహాలను అందుబాటులో ఉంచారు. పండుగకు ముందుగానే విగ్రహాలు మార్కెట్లోకి రావడంతో భక్తులు, కొనుగోలుదారులు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.బతుకమ్మ పూల కొను గోళ్లతో మార్కెట్ కళకళ ఆసిఫాబాద్: తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ నేపథ్యంలో ఆసిఫాబాద్ మార్కెట్, సందడిగా మారింది. పల్లెటూర్ల నుంచి వివిధ రకాల బతుకమ్మ పూలను తీసుకొచ్చిన అమ్మకందారులతో మార్కెట్ కళకళ లాడింది. పూల కొనుగోళ్ల కోసం మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రంగురంగుల పూలతో మార్కెట్ కిటకిట లాడగా, కొనుగోలుదారులు తమకు నచ్చిన పూలను కొనుగోలు చేశారు. బతుకమ్మ పండుగ సందడి పట్టణంలోని మార్కెట్లో స్పష్టంగా కనిపించింది.
Reporter
వాస్తవ గమ్యం