Sunday, 13 September 2026 07:02:44 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వాహనాల గందరగోళంతో అత్యవసర సేవలకు ఆటంకం

Date : 08 July 2026 04:07 PM Views : 250

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పార్కింగ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రి ఆవరణలో ఎక్కడ పడితే అక్కడ ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను పార్క్ చేయడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆసుపత్రి సిబ్బంది పర్యవేక్షణ లోపం, పార్కింగ్ నియంత్రణ లేకపోవడంతో పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు వచ్చే 108 అంబులెన్సులు సైతం ఆసుపత్రి గేటు నుంచి ఎమర్జెన్సీ విభాగం వరకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రద్దీ కారణంగా అంబులెన్సులు ఆలస్యంగా చేరుకోవడం వల్ల సీరియస్ పేషెంట్లను సకాలంలో చికిత్సకు తరలించే అవకాశాలు దెబ్బతింటున్నాయని పేర్కొంటున్నారు. కొన్నిసార్లు రోగులను అంబులెన్స్ నుంచి స్ట్రెచర్లపై దూరం వరకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు.ఆసుపత్రి వంటి అత్యంత కీలకమైన ప్రజా సేవా కేంద్రంలో పార్కింగ్ నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు. పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలను గుర్తించి, ట్రాఫిక్ నియంత్రణ సిబ్బందిని నియమించడం, అంబులెన్సులకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయడం, నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నిలిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రాణాలకు సంబంధించిన అత్యవసర సేవలు నిరాటంకంగా కొనసాగాలంటే ఆసుపత్రిలో పార్కింగ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని రోగులు, వారి బంధువులు, స్థానికులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: