వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రెబ్బెన మండల కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కేసర్ కిషన్ గౌడ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, సాంకేతిక రంగంలో ఆధునికతకు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని ఆయన సేవలను కొనియాడారు మందు తరాల వారికి ఆయన మార్గదర్శకులు అని అన్నారు అనంతరం నాయకులందరూ ఆయనను స్మరించుకున్నారు. యువతకు ప్రాధాన్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ, దేశ ప్రగతి కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం