Friday, 11 September 2026 02:47:37 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయండి, ప్రజావాణిలో బిజెపి వినతి పత్రం

Date : 17 August 2026 03:31 PM Views : 102

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చెన్నూర్ పట్టణంలో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులు, ప్రజా సమస్యలపై ప్రజావాణిలో బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.అంబేద్కర్ చౌక్ నుండి రావిచెట్టు వరకు అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు.మున్సిపల్ అధికారులు ఎలాంటి స్పష్టత లేకుండా రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించి, నాలుగు నెలలు గడుస్తున్నా పూర్తి చేయడం లేదని ఈ సందర్భంగా అన్నారు.రోడ్డు వెడల్పు, డ్రైనేజీ నిర్మాణం, లైటింగ్ వ్యవస్థపై ప్రజలకు స్పష్టమైన వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.రోడ్ల కూల్చివేతల వల్ల పేరుకుపోయిన శిథిలాలను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనివల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.చిన్నపాటి వర్షానికే డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరుతోందని, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.మంత్రి వివేక్ వెంకటస్వామి వెంటనే స్పందించి పనులను వేగవంతం చేయాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్ కౌన్సిలర్.గర్రబెల్లి శాంత వెంకట నరసయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి కాగిత వెంకటేష్ మౌనిక రౌతు శంకర్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు రాపర్తి వెంకటేశ్వర్ సీనియర్ నాయకులు కొండపాక చారి తలారి రాజులు తుమ్మ చిరంజీవి ఆడప శ్రీనివాస్ గడ్డం మల్లయ్య వెంకట్ రాజన్న శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :