Monday, 26 October 2026 05:23:14 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

ఆసిఫాబాద్ వైద్య విద్యార్థుల ధర్నా వేతనం పెంపు కోసం

Date : 09 October 2026 01:43 PM Views : 91

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఒకే విధమైన వైద్య సేవలు అందిస్తున్న తమకు స్టైపెండ్‌లో తీవ్ర వ్యత్యాసం ఎందుకని ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజి) ప్రశ్నిస్తున్నారు. ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జిజిహెచ్) పరిధిలో పనిచేస్తున్న ఎఫ్ఎంజి తమకు కూడా సమాన స్టైపెండ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు నెలకు కేవలం రూ.5,000 మాత్రమే స్టైపెండ్‌గా చెల్లిస్తున్నారని,అదే సమయంలోఐఎంజి కు నెలకు రూ.29,792 అందుతోందని వారు పేర్కొంటున్నారు.అన్ని పరీక్షలు పూర్తి చేసి, వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ తమకు ఇంత తక్కువ మొత్తం ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నెలకు రూ.5,000తో ప్రయాణం, భోజనం, ఇతర రోజువారీ ఖర్చులు భరించడం కష్టంగా మారిందని తెలిపారు. ఒకే విధమైన విధులు నిర్వహిస్తున్నప్పుడు స్టైపెండ్‌లో వివక్ష చూపకుండా, తమకు కూడా ఐఎంజి తో సమానంగా రూ.29,792 చెల్లించాలని కోరుతున్నారు.సంబంధిత అధికారులు తమ సమస్యను పరిశీలించి, సమాన స్టైపెండ్ అందించేలా చర్యలు తీసుకో వాలని ఎఫ్ఎంజి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.ఎఫ్ఎంజి ప్రధాన డిమాండ్: ప్రస్తుతం అందుతున్న నెలవారీ రూ.5,000 స్టైపెండ్‌ను ఐఎంజి కు అందుతున్న రూ.29,792కు సమానంగా పెంచాలి

JAVADE RAJU

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :