వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలోని ప్రతిభ ఆసుపత్రిలో గర్భిణి రుచిత, ఆమె గర్భంలోని శిశువు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రుచితను ఆసుపత్రికి తీసుకువచ్చారు.రాత్రి శిశువు మృతి చెందినట్లు వైద్యులు చెప్పి, ఆమెను మరో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే సుమారు గంటన్నర క్రితమే రుచిత మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శిశువు మృతి విషయం తెలిసినప్పటికీ సకాలంలో శస్త్రచికిత్స చేయకపోవడం వల్లే రుచిత మృతి చెందిందని వారు ఆరోపించారు.మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ప్రాణం విలువ రూ.2 లక్షలు ఇస్తామని ఆసుపత్రి వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ,ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Reporter
వాస్తవ గమ్యం