Saturday, 12 September 2026 05:47:34 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రిలో భారీ సింగరేణి స్క్రాప్ పట్టివేత

Date : 07 July 2026 06:32 PM Views : 108

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: సింగరేణికి చెందిన విలువైన స్క్రాప్‌ను అక్రమంగా నిల్వ చేసి తరలిస్తున్న ముఠాపై సింగరేణి ఎస్‌అండ్‌పీసీ (సెక్యూరిటీ అండ్ పోలీస్ కోఆర్డినేషన్) సిబ్బంది మంగళవారం ఆకస్మికంగా దాడి చేసి సుమారు 2 టన్నుల సింగరేణి స్క్రాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మందమర్రి పట్టణంలోని విద్యానగర్‌లో ఉన్న హనుమంతు స్క్రాప్ దుకాణంలో చోటుచేసుకుంది.సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాల ప్రకారం, సింగరేణికి చెందిన స్క్రాప్‌ను ఓ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో వెంటనే జూనియర్ ఇన్‌స్పెక్టర్ ఓదేలు, ఐడీ పార్టీ సభ్యుడు మల్లేశ్‌తో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు రెండు టన్నుల సింగరేణి స్క్రాప్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న స్క్రాప్ విలువ, అది ఏ గని ప్రాంతం నుంచి అక్రమంగా తరలించబడిందనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. సింగరేణి ఆస్తులను అక్రమంగా కొనుగోలు, నిల్వ లేదా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: