Monday, 14 September 2026 10:58:55 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

*అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ..

అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

Date : 10 June 2026 06:57 PM Views : 137

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి మండల పరిధిలోని అకెనపల్లి గ్రామంలో అధికారులు నిర్వహించిన గ్రామసభ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామసభ నిర్వహించేటప్పుడు ప్రజలకు స్పష్టంగా తెలిసేలా సభ ఉద్దేశాన్ని వివరించే బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, అకెనపల్లిలో ఎలాంటి ముందస్తు ప్రచారం గానీ, కనీసం ఒక బ్యానర్ కూడా పెట్టకుండానే అధికారులు సభను నిర్వహించారు. ​సభ జరుగుతున్న విషయమే చాలా మంది గ్రామస్థులకు తెలియకుండా పోయిందని, కేవలం కొద్దిమందితోనే సభను ముగించడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, గ్రామ అభివృద్ధి పనులపై చర్చించాల్సిన సభను ఇంత రహస్యంగా ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని అధికారుల తీరుపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనల ప్రకారం అందరికీ సమాచారం అందించి తిరిగి గ్రామసభను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :