Friday, 11 September 2026 02:49:20 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం..ముత్తైదులకు వాయనాలు

పూజ కార్యక్రమాలతో ఆధ్యాత్మిక సందడి.. ఆనందంగా వ్రత వేడుకలు

Date : 21 August 2026 07:01 PM Views : 93

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : శ్రావణ మాసంలో అత్యంత పవిత్రంగా భావించే వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.శుక్రవారం మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించి,అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు.​ఈ సందర్భంగా మహిళలు తెల్లవారుజామునే లేచి ఇళ్లను శుభ్రం చేసుకుని, కొత్త వస్త్రాలు ధరించి పసుపు,కుంకుమ,వివిధ రకాల పువ్వులతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు.కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ వరలక్ష్మీదేవిని వేడుకున్నారు.పూజా కార్యక్రమాల అనంతరం ముత్తైదువులకు,పెద్దలకు, పిల్లలకు తాంబూలంతో పాటు వాయనాలు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.పరస్పరం వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ మహిళలు ఎంతో ఆనందోత్సాహాల నడుమ వేడుకలు జరుపుకున్నారు.​సంప్రదాయాలు, ఆచారాలను కొనసాగిస్తూ కుటుంబ సభ్యులంతా ఒక్కటై ఈ వేడుకల్లో పాల్గొనడంతో ప్రతి ఇంటిలోనూ పండుగ శోభ ఉట్టిపడింది. ​

NERELLA ANUSHA GOUD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :