Monday, 14 September 2026 11:00:02 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

జర్మనీలో ఉద్యోగాలే లక్ష్యం: యువతకు టామ్‌కామ్ ద్వారా ప్రత్యేక శిక్షణ –

మంత్రి వివేక్ వెంకటస్వామి

Date : 13 May 2026 02:48 PM Views : 707

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జర్మనీ సహా పలు విదేశాల్లో ఉద్యోగాల కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మందమర్రిలో జూన్ 10, 2026 నుండి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. జర్మనీలో అవకాశాల కోసం జర్మన్ భాషా శిక్షణను టామ్‌కామ్ ప్రత్యేకంగా అందిస్తుంది. జర్మనీతో పాటు ఇజ్రాయెల్, గ్రీస్, జపాన్ దేశాల్లోనూ ఉద్యోగాలకు అవకాశం. మేసన్రీ, ఫార్మసీ, హాస్పిటాలిటీ మరియు ఐటీ రంగాల్లో భారీ డిమాండ్.విదేశీ ఉద్యోగాల పేరుతో మోసగించే ప్రైవేట్ ఏజెన్సీల కంటే ప్రభుత్వ సంస్థ అయిన టామ్‌కామ్‌ను ఆశ్రయించాలని మంత్రి యువతకు సూచించారు. ఉద్యోగం ఖాయమయ్యాకే టామ్‌కామ్ అభ్యర్థులను విదేశాలకు పంపుతుంది. యువత ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని ఆయన పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బడ్జెట్‌లో టామ్‌కామ్‌కు తగినన్ని నిధులు కేటాయించిందని, శిక్షణకు అవసరమైన మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇటీవల ఇజ్రాయెల్‌కు వెళ్లిన భవన నిర్మాణ రంగ నిపుణుల బృందం మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.జర్మనీ పర్యటనలో మన తెలుగు యువత పనితీరును స్వయంగా చూశాను. సరైన శిక్షణ, భాషపై పట్టు ఉంటే విదేశాల్లో అద్భుతమైన కెరీర్ నిర్మించుకోవచ్చు." ఈ కార్యక్రమంలో ఐటీఐ, ఏటీసీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రిని తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చదువుకున్న వారు తమ అర్హతకు తగ్గట్టుగా విదేశీ అవకాశాలు పొందవచ్చని మంత్రి భరోసా ఇచ్చారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: