Friday, 11 September 2026 02:46:45 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కేసులకు భయపడేది లేదు.. ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాం:

మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్

Date : 07 August 2026 04:23 PM Views : 90

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మితో కలిసి మంచిర్యాల జిల్లా కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.అనంతరం మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్, క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు మెజారిటీ ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు అక్రమ మార్గాలను అనుసరించిందని ఆరోపించారు.ప్రజల మద్దతుతో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు కోట్ల రూపాయలు, బ్లాంక్ చెక్కులు ఆఫర్ చేసినప్పటికీ వారు లొంగలేదని, అందుకే తమపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని పేర్కొన్నారు.ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నందుకే రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారని ఆరోపించిన ఆయన, గతంలో సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం మాట్లాడినందుకు 20 రోజుల పాటు చంచల్‌గూడ జైలులో ఉంచారని గుర్తు చేశారు.సోషల్ మీడియాలో పోస్టులు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపైకూడా కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని, ప్రతిపక్ష నేతలకు ఒక చట్టం, అధికార పార్టీ నేతలకు మరో చట్టం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ తరఫున గట్టిగా నిలబడతాం" అని బాల్క సుమన్ స్పష్టం చేశారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :