Sunday, 13 September 2026 10:52:26 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

రొయ్యలపల్లిలో హై ఓల్టేజ్ కలకలం శాశ్వత పరిష్కారం చూపకపోతే ఆందోళనలు తప్పవు

తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం హెచ్చరిక

Date : 21 May 2026 05:13 PM Views : 844

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : గ్రామంలో సరఫరా అవుతున్న హై ఓల్టేజ్ విద్యుత్ సమస్యను తక్షణమే పరిష్కరించి, ప్రజల ప్రాణాలను కాపాడాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది. నెల రోజులుగా హై ఓల్టేజ్ కారణంగా షార్ట్ సర్క్యూట్‌లు జరుగుతున్నా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం సంఘo ఆధ్వర్యంలో లైన్‌మెన్ శ్రీధర్‌కు గ్రామస్తులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం మాట్లాడుతూ.మండలంలోని రొయ్యలపల్లి గ్రామం గొల్లవాడలో పాత ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి, కొత్తది ఏర్పాటు చేసినప్పటి నుండి హై ఓల్టేజ్ విద్యుత్ సరఫరా అవుతోందని తెలిపారు. ​"ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎర్తింగ్ సరిగ్గా లేకపోవడం వల్లే నెల రోజులుగా షార్ట్ సర్క్యూట్‌లు జరుగుతున్నాయి. దీనివల్ల ఇళ్లలోని త్రాగునీటి మోటార్లు కాలిపోయి ప్రజలు నష్టపోతున్నారు. గతంలోనూ ఇలాంటి హై ఓల్టేజ్, షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల కారణంగా గ్రామంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. ఈ తీవ్రమైన సమస్యపై విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేయగా, వారు కేవలం తాత్కాలికంగా రిపేర్ చేసి వదిలేశారే తప్ప, శాశ్వత పరిష్కారం చూపలేదని మండిపడ్డారు.మరోసారి అలాంటి ప్రాణ నష్టం జరగకముందే అధికారులు స్పందించి, తగిన జాగ్రత్తలు తీసుకొని సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కోర్తే సమ్మయ్య, గ్రామస్తులు కొండగుర్ల రాజన్న, జిమిడే రాజమల్లు, కోట సురేష్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :