వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : మన్ననూరు:చెంచు ఆదివాసీల హక్కులు,చట్టాల రక్షణకు పోరాటమే ఏకైక మార్గమని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, కొమురం భీం వారసుడు కొమురం జంగు అన్నారు. మన్ననూరు ఐటీడిఏ గడ్డపై స్థానిక చెంచులతో కలిసి వారు భారీ శాంతియుత ‘ఆదివాసీ మార్చ్’ నిర్వహించారు. చెంచుల హక్కులు కాపాడాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆదివాసీలు ఐటీడిఏ వైపు ర్యాలీగా కదిలారు.
Reporter
వాస్తవ గమ్యం