Monday, 26 October 2026 02:47:10 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి. అధికారులకు గ్రామస్తుల విజ్ఞప్తి

Date : 15 October 2026 07:05 PM Views : 31

వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : తెల్లాపూర్ 263 డివిజన్ పరిధిలోని గ్రామంలో హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు ప్రతిపాదించిన నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ స్థలంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి ఆనుకుని, నివాస గృహాలకు సమీపంలో ఎస్టీపీ ఏర్పాటుకు అధికారులు స్థల సేకరణ చేస్తుండటంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమ వుతోంది.ఈ నేపథ్యంలో శుక్రవారం సంబంధిత అధికారులు స్థల పరిశీలనకు రాగా, గ్రామస్తులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు వారిని కలిసి అక్కడి పరిస్థితులను స్వయంగా వివరించారు. నివాసాల మధ్యలో ఎస్టీపీ నిర్మిస్తే దుర్వాసన, పర్యావరణ కాలుష్యం, రోగాల వ్యాప్తితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని, అయితే స్థానిక ప్రజల ఆరోగ్యం, ప్రశాంతతను దృష్టిలో ఉంచు కుని ఎస్టీపీని గ్రామానికి కాస్త దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో పలు పార్టీల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.గ్రామస్తుల వినతిపై స్పందించిన అధికారులు.. స్థానిక సమస్యలను ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగ కుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థల మార్పిడి విషయంలో కూడా గ్రామస్తులు అధికారులకు సహకరించాలని కోరారు.

V SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :