Monday, 26 October 2026 03:37:51 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

మంచిర్యాల జిల్లా ఎస్సీ సెల్‌ నూతన కార్యవర్గం ప్రకటన

Date : 24 September 2026 04:47 PM Views : 275

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ నూతన కార్యవర్గాన్ని గురువారం ప్రకటించారు.గతంలో జరిగిన నియామకాన్ని రద్దు చేస్తూ తాజాగా నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌ సాగర్‌రావు సిఫార్సు మేరకు జిల్లా అధ్యక్షుడిని మినహాయించి మిగతా కార్యవర్గాన్ని పీసీసీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో ఎంపిక చేసినట్లు తెలిపారు.జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం,ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అవగాహన కల్పించడం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహించడం నూతన కార్యవర్గం ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎస్సీ వర్గాల నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు సూచించారు.ఎస్సీ వర్గాలకు సంబంధించిన విద్య, ఉపాధి, సంక్షేమం, సామాజిక న్యాయం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను పార్టీ దృష్టికి తీసుకెళ్లేలా నూతన కమిటీ పనిచేయాలని పేర్కొన్నారు. నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాలో పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :