Sunday, 13 September 2026 10:52:50 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రిలో అదనపు జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.

డంపింగ్ యార్డు, మున్సిపల్ కార్యాలయం పరిశీలన

Date : 30 June 2026 07:14 PM Views : 303

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 30 :మంచిర్యాల జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ (లోకల్ బాడీస్) ఈరోజు మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని చత్లాపూర్ గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. డంపింగ్ యార్డు నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ విధానాలను మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఈ. వసంత్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ఎం. గోపీకృష్ణ అదనపు జిల్లా కలెక్టర్‌కు వివరించారు.సందర్శన సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2026 మార్గదర్శకాల ప్రకారం తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలు , శానిటరీ వ్యర్థాలను తప్పనిసరిగా వేర్వేరుగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అదనపు జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డులో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.అనంతరం మందమర్రి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన అదనపు జిల్లా కలెక్టర్, ఇటీవల అకౌంట్స్ విభాగంలో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, కార్యాలయ నిర్వహణను మరింత పటిష్ఠంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.తదుపరి మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని మీ సేవా కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ సేవలు పొందుతున్న ప్రజలతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి పి. కృష్ణ ప్రసాద్, మున్సిపల్ మేనేజర్ ఈ. రాజేశ్వరి, సంబంధిత అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: