Sunday, 13 September 2026 07:32:12 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

గోదావరిపై వంతెన కోసం పోరుబాట

మంచిర్యాలలో బీజేపీ భారీ ధర్నా

Date : 13 April 2026 04:48 PM Views : 126

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​మంచిర్యాల పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది.గతంలో మంజూరైన వంతెనను రద్దు చేయడంపై మంచిర్యాల అంతర్గాం ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమ రవాణా కష్టాలు తీరాలంటే వంతెన నిర్మాణం ఒక్కటే మార్గమని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం హోరెత్తింది.మంచిర్యాల అంతర్గాం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం11గంటలకు ఐబీ చౌరస్తా వద్ద బీజేపీ భారీ ధర్నా నిర్వహించింది.ఈ ధర్నాకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్,చెన్నూర్ నియోజకవర్గ నాయకులు దుర్గం అశోక్ నాయకత్వం వహించారు.​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.మంచిర్యాల,పెద్దపల్లి జిల్లాలను కలిపే ఈ వంతెన నిర్మాణం ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు.​గతంలోనే ఈవంతెన మంజూరైనప్పటికీ, ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం వల్ల వేలాది మంది ప్రజలు, విద్యార్థులు,రోగులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.వంతెన లేకపోవడం వల్ల కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి పనులు ప్రారంభించాలని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో కోటపెల్లి మండలం నుండి మంత్రి రామయ్య, గుర్రం నారాయణతో పాటు వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వంతెన నిర్మాణం చేపట్టాలి రవాణా కష్టాలు తీర్చాలి అంటూ చేసిన నినాదాలతో మంచిర్యాల మార్మోగింది.ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే, ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.ఈ ధర్నాకు ప్రజల నుండి కూడా విశేష మద్దతు లభించింది.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :