వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడలో ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ముత్తంపేట గ్రామ సర్పంచ్ రాంటెంకి ఉష మోతిరామ్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు మాజీ సర్పంచ్ కస్తూరి సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ ధోని శ్రీనివాస్,వార్డు సభ్యులు పెరుగు విక్రమ్, సురేష్, నాగరాజు, విశ్వనాథ్ తదితర నాయకులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో, మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యామ్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ పార్టీ కండువాలు కప్పి వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం