వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: బీఆర్‌ఎస్ మందమర్రి పట్టణ అధ్యక్షుడు జే. రవీందర్ అంతిమయాత్రలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్,నల్లాల ఓదెలు పాల్గొన్నారు.రవీందర్ భౌతికకాయానికి నివాళులర్పించిన వారు అంతిమయాత్రలో డప్పు కొడుతూ పాల్గొని తమ సన్నిహితత్వాన్ని చాటుకున్నారు.రవీందర్ మృతితో తీవ్ర విషాదానికి గురైన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.అనంతరం అంతిమయాత్రలో పాల్గొని రవీందర్‌కు తుది వీడ్కోలు పలికారు. మాజీ ఎమ్మెల్యేలు స్వయంగా డప్పు కొడుతూ అంతిమయాత్రలో పాల్గొన్న దృశ్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.రవీందర్ రాజకీయ ప్రస్థానంలో నల్లాల ఓదెలతో కలిసి పనిచేసిన అనుబంధం ఉండగా,బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బాల్క సుమన్‌తోనూ ఆయనకు రాజకీయ పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అంతిమయాత్రలో పాల్గొని నివాళు లర్పించడం చర్చనీయాంశంగా మారింది.
Reporter
వాస్తవ గమ్యం