Monday, 14 September 2026 11:01:14 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎంపిక.

ప్రజాసేవలను మరింత వేగవంతం చేస్తాం: నూతన కమిటీ

Date : 30 June 2026 07:23 PM Views : 396

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 30: మందమర్రి పట్టణ ప్రజలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను వేగవంతంగా అందించేందుకు కృషి చేస్తామని లయన్స్ క్లబ్ ఆఫ్ మందమర్రి నూతన కార్యవర్గం సభ్యులు తెలిపారు.మందమర్రి పట్టణంలోని శ్రీకృష్ణ గార్డెన్స్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ మందమర్రి 2026–27 సంవత్సరానికి నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షుడిగా పెండ్యాల గౌతమ్ చారి, కార్యదర్శిగా ఎండి జాకీర్, కోశాధికారిగా బుర్ర ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అనంతరం రిక్కల నారాయణరెడ్డి నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, దేశ, రాష్ట్ర స్థాయిలో లయన్స్ క్లబ్ సేవలకు విశేష గుర్తింపు ఉందని పేర్కొన్నారు. లక్షలాది మందికి ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి కంటి వెలుగును ప్రసాదించిన ఘనత లయన్స్ క్లబ్‌కే దక్కిందన్నారు. అలాగే విద్య, వైద్యం, పర్యావరణం, సామాజిక సేవ తదితర రంగాల్లో దేశవ్యాప్తంగా క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని తెలిపారు. మందమర్రి పట్టణంలో కూడా ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్ సతుకు సుదర్శన్ , ప్రోగ్రాం కో-చైర్మన్ పోలు శ్రీనివాస్, అరసవెల్లి శ్రీనివాస్, కొక్కుల మధు, తౌటం శ్రీనివాస్, కౌట్ల అనితతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: