వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సీనియర్ పాత్రికేయులు, కవి మట్టె రవీందర్ రాసిన మరో కవిత ప్రచురణకు ఎంపికైంది. అక్షయ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘తీరు తీరు పూలు’ కవితా సంకలనంలో రవీందర్ రచించిన ‘నిస్సహాయ జీవితం’ కవిత ప్రచురితమైంది.ముద్రితమైన ఈ పుస్తకాన్ని ఈ నెల 23న లక్షెట్టిపేట బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆవిష్కరించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కార్యక్రమానికి ప్రముఖ రచయిత, చరిత్ర పరిశోధకులు డాక్టర్ తుమ్మల దేవ్‌రావు ముఖ్య అతిథిగా, ప్రముఖ రచయిత్రి నీలాదేవి పుస్తక పరిచయకర్తగా హాజరుకానున్నారు.ఈ విషయాన్ని అక్షయ సాహితీ సంస్థ అధ్యక్షుడు న్యూటెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి వేనంక చక్రవర్తి తెలిపారు. సాహిత్యాభిమానులు, సాహితీ మూర్తులు కార్యక్రమానికి హాజరై పుస్తకావిష్కరణను విజయవంతం చేయాలని వారు కోరారు.
Reporter
వాస్తవ గమ్యం