Saturday, 12 September 2026 05:53:05 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రమాదేవి రాజేంద్రప్రసాద్‌కు ఘన సన్మాన వీడ్కోలు

Date : 05 July 2026 04:12 PM Views : 106

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్: గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి రమాదేవి రాజేంద్రప్రసాద్‌కు ఆత్మీయ సన్మాన వీడ్కోలు సభ శనివారం రాత్రి ఆసిఫాబాద్ పట్టణంలోని వడ్డేపల్లి గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరై రమాదేవి దంపతులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ.రమాదేవి దాదాపు మూడు సంవత్సరాల పాటు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా సమర్థవంతంగా సేవలందించడంతో పాటు, అదనంగా మరో నాలుగు శాఖలకు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ విశిష్ట సేవలు అందించారని అన్నారు. ఆమె ఉద్యోగ జీవితం మొత్తం గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు.ఏటూరు నాగారం, ములుగు, భద్రాచలం, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ గిరిజనుల సంక్షేమం, విద్య, విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలో ఆమె చూపిన నిబద్ధత, నిజాయితీ, సేవాభావం అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.ఆమె భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, పివిటిజి ఏపీఓ ఆత్రం భాస్కర్, ఏజెన్సీ డిప్యూటీ డివో గోడం చందాన్ష డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్స్ మాడవి శేక్కు,జీవరత్నం,GCDO శకుంతల. క్రికెటర్ నాగేందర్,కొమరం భీమ్ జిల్లా ఏటిడిఓ,హెడ్ మాస్టర్స్ SCRP'S, PD'S 'ఉపాధ్యాయులు.. కృష్ణారావు, మీనా రెడ్డి,కనక వెంకటేశ్వరరావు, శ్యామ్ రావు.. ఆదివాసి సంఘాల నాయకులు సీడం అర్జున్ మాస్టర్, పేందర్ సుధాకర్, ఆత్రం భీమ్రావు, బుర్సా పోచయ్య, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: