వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి మండలంలోని ముత్తాపూర్ గ్రామానికి చెందిన దాదాపు 30 మంది గ్రామస్తులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రేణికుంట్ల ప్రవీణ్ సమక్షంలో పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి ప్రవీణ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్ల వేళలా అందుబాటులో ఉంటానని, కేసీఆర్ను మళ్లీ ముఖ్య మంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ఎండీ నాజర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముత్తాపూర్ మాజీ సర్పంచులు చంద్రయ్య, తిరుపతి, కన్నెపల్లి మాజీ ఎంపీటీసీ మంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం