Sunday, 13 September 2026 07:33:03 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కాగజ్‌నగర్ పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి:

జిల్లా కలెక్టర్ కె.హరిత

Date : 04 June 2026 05:29 PM Views : 115

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కాగజనగర్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. గురువారం ఆమె కాగజ్‌నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌక్ నుండి రాజ్ టాకీస్ చౌరస్తా వరకు గల రహదారిని మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లతో కలిసి స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజూ మురుగు కాలువలను శుభ్రం చేయాలని, తడి-పొడి చెత్తను క్రమం తప్పకుండా సేకరించాలని స్పష్టం చేశారు. తనిఖీల్లో భాగంగా రోడ్డుపై నీరు, ఎంగిలి ప్లేట్లు పడేసిన ‘గురుకృప టిఫిన్ సెంటర్’ యజమానికి జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ తిరుపతిని ఆదేశించారు. వ్యాపారులు, ప్రజలు ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లను రోడ్లపై వేయకుండా చెత్తకుండీల్లోనే వేయాలని, కాగజ్‌నగర్‌ను స్వచ్ఛమైన పట్టణంగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లు మరియు పౌర సంబంధాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :