వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : సైబర్ నేరాల గురించి వ్యక్తిగత సమాచారం ను అపరిచిత వ్యక్తుల తో పంచుకోవదు అని సిఐ కె సంజయ్ అన్నారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు ఆదివారం రెబ్బెన ఎన్‌టీఆర్ కాలనీ లో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా నేరాల నియంత్రణకై శాంతి భద్రతల పరిరక్షణ కొరకు అవగాహన కల్పించారు. అక్రమ మద్యం విక్రయాలకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల పై కేసు లు నమోదు చేసినట్లు తెలిపారు.40వాహనాలను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకో పడతాయి అన్నారు. హెల్మెట్ ఆవశ్యకతను వివరించారు.మద్యం తాగి వాహనాలు నడుపవద్దు అని రోడ్డు ప్రమాదాల గురించి వివరించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు,బెట్టింగ్ యాప్స్ దూరంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం