వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : గత ఆర్థిక సంవత్సరం (2025–26) సింగరేణి సంస్థ ఆర్జించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలని,ఎలాంటి మినహా యింపులు లేకుండా ఆ లాభాల్లో కార్మికులకు 36 శాతం వాటా కేటాయించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) డిమాండ్ చేసింది.ఈ మేరకు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాలు, బెల్లంపల్లి రీజియన్ వైస్ ప్రెసిడెంట్ సూచనలతో నాయకులు ఏరియా వర్క్‌షాప్ ఇన్ఛార్జ్ నరేష్‌కు వినతిపత్రం (మెమొరాండం) సమర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని,ఆర్జించిన వాస్తవ లాభాల నుంచి ఎటువంటి కోతలు లేకుండా పూర్తి స్థాయిలో 36% వాటాను కార్మికులకు అందించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏరియా వర్క్‌షాప్ పిట్ సెక్రటరీ గాజవెని శ్రీనివాస్, సెంట్రల్ కమిటీ సభ్యులు ధారవత్ మంగీలాల్, ఏరియా జాయింట్ సెక్రటరీ జి. వెంకట్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ఎస్. సురేష్ పాల్గొన్నారు. వీరితో పాటు యూనియన్ నాయకులు గణపతి, వైకుంఠం, ఎస్. వెంకటేశ్వర్లు, కనకయ్య, వెంకటస్వామి, అంజయ్య, చంద్రయ్యలతో పాటు పలువురు వర్క్‌షాప్ కార్మికులు, మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Admin
వాస్తవ గమ్యం