వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర నేతృత్వంలోని ఆదివాసీ జేఏసీ నాయకులు ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలపై ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.జనాభా లెక్కల్లో ఆదివాసీల మతాన్ని గుర్తించేలా ప్రత్యేకంగా 'ఆదివాసీ' కాలమ్ ఏర్పాటు చేయాలి.ఆదివాసీల భాష ‘కోయతూర్’ ను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలి.కేంద్రం పెసా చట్టాన్ని బలహీనపరుస్తోందని, పోలవరం నిర్వాసితులకు సరైన పునరావాసం కల్పించడం లేదని కవిత మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ ఆదివాసీల ఆత్మగౌరవం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతుందని ఆమె హామీ ఇచ్చారు. ఆదివాసీ జేఏసీ పోరాటానికి తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా కవిత ప్రకటించారు.
Admin
వాస్తవ గమ్యం