Saturday, 12 September 2026 04:35:17 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కళ్యాణ లక్ష్మీ పథకం కొనసాగించాలి

Date : 17 August 2026 03:04 PM Views : 116

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మందమర్రి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాలతో ఈ ఆందోళన చేపట్టినట్లు నాయకులు తెలిపారు.మందమర్రి పట్టణం, మండలం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గతంలో అమలైన రూ.1,00,116 ఆర్థిక సహాయాన్ని కొనసాగించాలని కోరారు.కళ్యాణ లక్ష్మీ పథకం పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, ప్రభుత్వం ఈ పథకంపై స్పష్టత ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. పథకాన్ని నిలిపివేస్తే రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ సంధ్యారాణి, డాక్టర్ రాజారమేష్‌తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, TBGKS యూనియన్ నాయకులు, వార్డు అధ్యక్షులు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: