Monday, 26 October 2026 02:46:10 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

Date : 18 October 2026 12:26 PM Views : 92

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రంగురంగుల పూల కొనుగోళ్లతో మార్కెట్‌లో పండుగ సందడి ఆసిఫాబాద్ పట్టణంలోని మార్కెట్‌లో ఆదివారం బతుకమ్మ పూల సందడి నెలకొంది. బతుకమ్మ పండుగ నేపథ్యంలో మార్కెట్‌కు వివిధ రకాల పూలు భారీగా చేరడంతో వ్యాపారులు విక్రయాల్లో బిజీగా కనిపించారు. మహిళలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు చేరుకుని పూలను కొనుగోలు చేశారు.తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర రంగు రంగుల పూలతో మార్కెట్ కళకళలాడింది. బతుకమ్మను సంప్రదాయబద్ధంగా పేర్చేందుకు అవసరమైన పూలను మహిళలు ఉత్సాహంగా కొనుగోలు చేశారు. పూల కొనుగోళ్ల కోసం మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. పండుగకు అవసరమైన పూలను కొనుగోలు చేస్తూ మహిళలు బతుకమ్మ వేడుకలకు సిద్ధమ య్యారు. దీంతో ఆసిఫాబాద్ మార్కెట్‌లో పండుగ శోభ సంతరించుకుంది.

JAVADE RAJU

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :