వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాంకిడి మండలం సవాతి గ్రామపంచాయతీ పరిధిలోని అంతాపూర్ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న 104 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కుడిమెత జైవత్ రావు (23)ను అరెస్టు చేశారు. పత్తి, కంది పంటల మధ్య గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ సుమారు రూ.10.40 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ సందర్భంగా డీఎస్పీ అశోక్ మాట్లాడుతూ.గంజాయి సాగు, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ గంజాయి సాగుపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం