Monday, 14 September 2026 10:03:27 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మార్లవాయి గ్రామాన్ని సందర్శించిన ఐటీడీఏ అధికారి

పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి చెందేలా కృషి చేయాలని గ్రామస్థుల వినతి

Date : 03 May 2026 05:10 PM Views : 134

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం జిల్లా, జైనూర్ మండలం, మార్లవాయి గ్రామాన్ని ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి మంద మకరంద్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాల డప్పు వైద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ మహిళలు నుదుటి తిలకం దిద్దగా,పూల బొకే అందజేసి గ్రామపంచాయతీ సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆదివాసి ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ మరియు ఆదివాసి పోరాటయోధుడు కొమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డార్ఫ్ మ్యూజియాన్ని సందర్శించి చారిత్రక విషయాలను వివరంగా తెలుసుకున్నారు. అలాగే హైమన్ డార్ఫ్ రీడింగ్ లైబ్రరీ, కాటేజ్, పద్మశ్రీ గుసాడి శిక్షణ కేంద్రం,గొండ్వాన పంచాయతీ రాజ్ సెంటర్ దర్బార్ స్థలం,1941లో డార్ఫ్ దంపతులు నివసించిన ప్రదేశం, ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలుర పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి అన్ని వివరాలను తెలుసుకున్నారు. తదుపరి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు అధ్యక్షతన మాట్లాడుతూ, చారిత్రక ప్రాధాన్యం గల మార్లవాయి గ్రామాన్ని ప్రత్యేక నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. డార్ఫ్ నివేదిక ప్రకారం ఆదివాసుల అభివృద్ధి జరగాలని, ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రాగాపూర్ నుండి మార్లవాయి వరకు ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాలని, గ్రామ చివరలో ఉన్న చెరువు ఆయకట్టను పెంచి కుడి-ఎడమ కాలువలు ఏర్పాటు చేసి వ్యవసాయానికి నీటి సదుపాయం కల్పించాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని, డార్ఫ్ దంపతుల వర్ధంతి సభను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మంజూరు చేసిన పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని కూడా కోరారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి మంద మకరంద మాట్లాడుతూ, ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఆదివాసుల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుల స్ఫూర్తి అందరికీ ఆదర్శమని తెలిపారు. వారు చూపిన మార్గంలో ఆదివాసీలు ముందుకు సాగడం గొప్ప విషయమని, విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో ప్రత్యేక చర్యలు తీసుకొని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పనిచేస్తామని పేర్కొన్నారు. పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలని, డ్రాప్‌ఔట్ లేకుండా ప్రతి విద్యార్థి పాఠశాలలో కొనసాగేందుకు తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులు డార్ఫ్ దంపతుల చిత్రపటాన్ని బహుకరించి,ప్రాజెక్ట్ అధికారికి ఆత్మీయ సన్మానం చేశారు. డార్ఫ్ నివేదిక పుస్తకాన్ని గ్రామస్తులు అందజేశారు. గ్రామస్థులు మాట్లాడుతూ, ప్రాజెక్ట్ అధికారి గ్రామానికి రావడం ఎంతో సంతోషకరమని, తెలంగాణ బిడ్డగా ఈ ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహనతో మాట్లాడటం ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం రెండు గంటల పాటు సమయం కేటాయించి, అందరి అభిప్రాయాలను తెలుసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు DTDO రమాదేవి, ATDO శ్రీనివాస్, గ్రామ పెద్దలు పటేల్ ఆత్రం మాణిక్ రావు, దేవరీ కనక గణపత్, ఉపసర్పంచ్ ఆత్రం రాజేశ్వర్, జైనూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మండాడి లింగు, వార్డ్ సభ్యులు భారత్, పుల్లాబాయి, పార్వతి గణపత్, దర్యావంతి గోవిందరావు, సీత, పిసా మొబిలైజర్ యాదవ్, వివో అధ్యక్షులు కనక రూపాయి, ఆశ వర్కర్ చంద్రకళ, AOV సీత, గ్రామస్తులు భగవంతురావు, బారికరావు హనుమంతరావు, భుజంగ్ రావ్, రాము, సోనేరావ్, దేవ్ షా, తుకారం,చందు, లచ్చు, శీను తదితరులు పాల్గొన్నారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: