వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 25: స్థానిక సీఈఆర్ క్లబ్ ఆవరణలో మందమర్రి ఏరియాకు చెందిన ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగులకు సీనియారిటీ ప్రాతిపదికన క్వార్టర్ల కేటాయింపు కౌన్సెలింగ్‌ను గురువారం నిర్వహించారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 109 క్వార్టర్లు అందుబాటులో ఉండగా వాటి కోసం 175 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల మేరకు సీనియారిటీ ఆధారంగా పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి,అర్హత కలిగిన 27 మంది ఉద్యోగులకు క్వార్టర్లనుకేటాయించినట్లు వెల్లడించారు.ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను ఎస్‌వోటు జీఎం జి.ఎల్. ప్రసాద్, డిప్యూటీ పీఎం విజయ్ సందీప్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ కార్తీక్, పర్సనల్ డిపార్ట్‌మెంట్ ఓఎస్ రాజలింగు, మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్) ఆర్. వీణతో పాటు పర్సనల్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది పర్యవేక్షించారు.
Reporter
వాస్తవ గమ్యం