Sunday, 13 September 2026 07:33:05 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

విద్యుత్ ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి: సీఐటీయూ డిమాండ్

Date : 15 April 2026 02:54 PM Views : 138

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ల తమ సమస్యల పరిష్కారం కోసం గత ఏడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా మంచిర్యాలలో నిరసన జ్వాలలు మిన్నంటాయి.బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి,స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ధర్నా చేపట్టారు.ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్లేకార్డులతో నినదిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నాయకులు విమర్శించారు.సమ్మె చేస్తున్న కార్మికులను విధుల్లో నుంచి తొలగిస్తామంటూ బెదిరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19 వేల మంది ఆర్టిజన్లు, 1,400 మంది అన్మెన్, పీసెట్ కార్మికులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సింది పోయి, కార్మికులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు.కార్మికుల డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కావు. ప్రభుత్వం ఇచ్చిన హామీలనే వారు అడుగుతున్నారు. టర్మినేషన్ ఉత్తర్వులతో సమ్మెను అణచివేయాలని చూడటం అగ్నికి ఆజ్యం పోయడమే అవుతుంది." ​ప్రభుత్వం తక్షణమే స్పందించి ట్రాన్స్‌కో, జెన్‌కో, మరియు డిస్కాం పరిధిలోని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు గోమాస ప్రకాష్, చిన్నయ్య, మరియు నాయకులు వెంకటేష్, అంజి, కిష్టయ్య, అరుణ్ కుమార్, శ్రీనివాస్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :