వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్.జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని జైనూర్ మార్కెట్ కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జైనూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు *షేక్ రసీద్* ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ *కూడ్మేత విశ్వనాథ్ రావు* మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధి కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడంతో పాటు, సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి, గ్రామీణాభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన కృషి దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడికి ఓటు హక్కు కల్పించడంలో రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిందని విశ్వనాథ్ రావు అన్నారు. నేటి యువత రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిర్పూర్ మండల అధ్యక్షులు ఆత్రం శంకర్, DCC సబ్బ్యులు పెంధోర్ ప్రకాష్, సర్పంచ్లు రాందాస్, చందంషా,రాస్సిమిట్ట సర్పంచ్ చందు, విఠల్, షేకూ, అబ్బూ, భూపతి, పొలాస ఉపసర్పంచ్ గంగామణి ముఖుందరావు, గోపీచంద్, అజ్జులాలా, దౌలత్ రావ్, దత్తు, రహీం, ఇస్లామ్, నాగేష్, అజీమ్,కోవా సిద్దు దండుగుల మహేష్ క్రిష్ణ మార్కెట్ కమిటీ సిబ్బంది, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించారు.
Reporter
వాస్తవ గమ్యం