వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని బస్తీ ప్రజలు రెండు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ పైప్‌లైన్ సమస్యకు పరిష్కారం లభించింది. సమస్యను మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి సింగరేణి ఏరియా జీఎం రాధాకృష్ణను సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి సూచనల మేరకు సింగరేణి సిబ్బంది డ్రైనేజీ పైప్‌లైన్ మరమ్మతు పనులు చేపట్టడంతో బస్తీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామిని బస్తీ ప్రజలు శాలువాతో ఘనంగా సన్మానించి, మంత్రి, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం