Saturday, 12 September 2026 09:04:11 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రి ఎంపీడీవో ఆఫీస్ ముందు మద్యం సీసాలు

Date : 06 July 2026 04:11 PM Views : 111

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం వందలాది మంది వచ్చే ప్రభుత్వ కార్యాలయం ఎదుటే మద్యం సేవించడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఉదయం మందమర్రి ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణం ముందు మద్యం సీసాలు, ఖాళీ బాటిళ్లు కనిపించడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు, అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం, రాత్రి వేళల్లో కొందరు మందుబాబులు ఎంపీడీవో కార్యాలయం పరిసరాలను అడ్డాగా మార్చుకుని బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మద్యం సేవించిన అనంతరం ఖాళీ సీసాలు, వ్యర్థాలను అక్కడే వదిలివెళ్లడంతో ప్రభుత్వ కార్యాలయ పరిసరాల పరిశుభ్రత దెబ్బతింటోందని, కార్యాలయానికి వచ్చే మహిళలు, వృద్ధులు, ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమైనప్పటికీ, కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాత్రి వేళల్లో పోలీసు నిఘా పెంచాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి కార్యాలయ పరిసరాల్లో భద్రత, పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు కోరుతున్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :