వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'కళ్యాణ లక్ష్మి', 'షాదీ ముబారక్' ఆర్థిక సహాయ పథకాలను నిలిపివేసేందుకు లేదా నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, సంక్షేమ పథకాలను కొనసాగించాలని భీమారం రెవెన్యూ కార్యాలయంలో ఆర్ఐ రజితకు బిఆర్ఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు.అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలతో హోరెత్తించారు. పేద ప్రజల ఆడపిల్లల వివాహాలకు అండగా నిలుస్తున్న ఈ పథకాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం